Neena Gupta: ఈ వయసులో నీకేం పోయే కాలం.. 70ఏళ్లొచ్చిన కోరిక చావట్లేదా

by Disha Web Desk 7 |
Neena Gupta: ఈ వయసులో నీకేం పోయే కాలం.. 70ఏళ్లొచ్చిన కోరిక చావట్లేదా
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా చిన్న పిల్లల దుస్తులు ధరించినందుకు నెట్టింట దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. ఇటీవల ముంబైలోని ఓ పార్టీకి సరికొత్త లుక్‌లో హాజరైన ఆమె.. బ్లాక్ కలర్ టాప్, ఎత్తైన బూట్లు, మ్యాచింగ్ పర్స్‌, గ్లాసెస్‌తో దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ వేషాధారణలో కెమెరాలకు పోజులివ్వడం విశేషం. కాగా ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

దీంతో వయస్సు గురించి పట్టించుకోకుండా సింపుల్ మేకప్‌, అందమైన చెవిపోగులు, డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఆనందంగా ఉందని నైస్ అవుట్‌ఫిట్ అంటూ తన అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. కొంతమందేమో ‘చాలా అసౌకర్యంగా కనిపిస్తోంది. అలాంటప్పుడు ఈ దుస్తులు ఎందుకు ధరించాలి? చీరలోనే చాలా అందంగా కనిపిస్తారు’ అంటున్నారు. ఇకొందరైతే ‘ఈ వయసులో నీకేం పోయే కాలం. 70ఏళ్లొచ్చిన కోరిక చావట్లేదా. వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలని చాలా కష్టపడుతున్నావ్’ అంటూ తిట్టిపోస్తున్నారు.

Next Story