NC-24: నాగ చైతన్య న్యూ మూవీ టైటిల్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్వీట్

by I. Sairam |   (  Updated:2025-04-25 12:21:17  IST  )

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) రీసెంట్‌గా 'తండేల్‌'(Thandel) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారన్న సంగతి మనందరికీ తెలిసిందే.

NC-24: నాగ చైతన్య న్యూ మూవీ టైటిల్ ఫిక్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) రీసెంట్‌గా 'తండేల్‌'(Thandel) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన 'విరూపాక్ష' ఫేమ్‌ కార్తీక్‌ దండు(Karthik Dandu) దర్శకత్వంలో NC-24 అనే మూవీలో నటించనున్నాడు. అయితే దీనిని సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌(BVSN Prasad) నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎన్‌సి-24 మూవీకు ‘వృష కర్మ’(Vrusha Karma) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Next Story