NC 24: నాగచైతన్య - కార్తీక్ మూవీలో చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ?.. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్

by Gugulothu.Kavitha |

అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chitanya) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

NC 24: నాగచైతన్య - కార్తీక్ మూవీలో చాన్స్ కొట్టేసిన యంగ్ బ్యూటీ?.. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్
X

దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chitanya) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చందు మొండేటి(Chandu Mondeti) డైరెక్షన్‌లో ‘తండేల్’(Thandel) అనే మూవీ చేస్తున్నాడు. నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రానుంది. ఇక ఈ చిత్రం రిలీజ్ కాకముందే రీసెంట్‌గా డైరెక్టర్ కార్తిక్ వర్మ దండు(Karthik Varma Dandu) దర్శకత్వంలో నాగ చైతన్య కొత్త మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. చై కెరియర్‌లో 24వ(NC24) సినిమాగా వస్తున్న ఈ చిత్రం మైథాలజికల్ థ్రిల్లర్‌గా మూవీగా తెరకెక్కబోతున్నట్లు చిత్ర బృదం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర(Sri Venkateswara) సినీ చిత్ర, సుకుమార్(Sukumar) రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఫస్ట్ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary)ని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్న చిత్ర బృదం.. తాజాగా ‘పుష్ప 2’(Pushpa 2) సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela)ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. త్వరలోనే వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని కూడా మూవీ మేకర్స్ షేర్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఇటీవలె నాగ చైతన్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story