నయనతార-విఘ్నేష్‌లను ఇండస్ట్రీ నుండి బాయ్ కాట్ చేయాలి.. నిర్మాతలు?

by Disha Web Desk 6 |
నయనతార-విఘ్నేష్‌లను ఇండస్ట్రీ నుండి బాయ్ కాట్ చేయాలి.. నిర్మాతలు?
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతార కోలీవుడ్, తెలుగు అని తేడా లేకుండా స్టార్ హీరోలతో అనేక సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుండి భార్యభర్తలిద్దరు పలు వివాదాల్లో ఇరుకుంటూనే ఉన్నారు. పిల్లల విషయంలో ఏకంగా సరోగసీ ప్రాసేస్ ద్వారా ఇల్లీగల్‌గా పిల్లలను కని ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

తాజాగా, నయన్-విఘ్నేష్ కోలీవుడ్‌లో మరో వివాదంలో ఇరుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. నయన తార దగ్గరకు వస్తున్న సినిమాలను డైరెక్ట్ చేయడానికి విఘ్నేష్‌కు ఇస్తుందట. అంతేకాకుండా వేరే డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలను కూడా నయనతార తన పలుకుబడితో క్యాన్సిల్ చేయించి మరీ విఘ్నేష్‌కు ఇచ్చే ప్లాన్ చేస్తుందట. దీంతో మిగతా నిర్మాతలకు ఛాన్స్‌లు రాక వారి జీవితం నాశమవుతుందట. ఈ నేపథ్యంలో పలువురు స్టార్ డైరెక్టర్లు నయనతార పద్ధతి మార్చుకోకపోతే భార్యభర్తలిద్దరినీ ఇండస్ట్రీ నుండి బాయ్ కాట్ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారట.

Next Story