- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లీజ్.. నన్ను అలా పిలవొద్దు.. నయనతార కామెంట్స్ వైరల్
కెరీర్‌ను రైట్ వేలో డిజైన్ చేసుకున్న నయనతార.. ప్రస్తుతం ‘లేడీ సూపర్ స్టార్’గా మన్ననలు అందుకుంటుంది.

దిశ, సినిమా : కెరీర్‌ను రైట్ వేలో డిజైన్ చేసుకున్న నయనతార.. ప్రస్తుతం ‘లేడీ సూపర్ స్టార్’గా మన్ననలు అందుకుంటుంది. తాజాగా ‘అన్నపూరణి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆమె.. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ లేడీ సూపర్ స్టార్‌గా పరిచయం చేస్తుండటంతో.. ప్లీజ్ అలా పిలవొద్దని సూచించింది. ఎవరైనా అలా పిలిస్తే తిట్టినట్లుగా అనిపిస్తుందని చెప్పింది. అంతేకాదు ‘ఈ రోజు నేను పొందిన కీర్తి, గౌరవం, అదృష్టం.. అన్నీ సినిమానే ఇచ్చింది’ అని.. తన ప్రయాణంలో చిత్ర పరిశ్రమ ఎంత గొప్ప ప్రభావాన్ని చూపిందో వివరించింది.
కాగా ‘అన్నపూరణి : ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ సినిమాలో ఫుడ్ మీద ప్యాషన్‌తో ఉన్న అమ్మాయిగా కనిపించింది నయన్. మాంసం ముట్టుకోవడాన్ని తప్పుగా భావించే ఓ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. వరల్డ్‌లోనే గ్రేట్ చెఫ్‌గా ఎదగాలని అనుకుంటుంది. అందుకే ఎంబీఏ అని ఇంట్లో చెప్తూ హోటల్ మేనేజ్మెంట్ చదువుతుంది. అయితే ఈ నిజం తెలిసి తర్వాత ఆ కమ్యూనిటీ వారు తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనేదే కథ.






