విడాకులు తీసుకోబోతున్న నయనతార.. పోస్ట్ వైరల్

by Sujitha Rachapalli |   (  Updated:2025-07-03 13:01:28  IST  )

లేడీ సూపర్ స్టార్ నయనతార.. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు సరోగసి ద్వారా వెల్‌కమ్ చెప్పింది. అయితే ప్రజెంట్ నయన్ విడాకులు తీసుకోబోతుందన్న వార్త వైరల్ అవుతోంది.

విడాకులు తీసుకోబోతున్న నయనతార.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార.. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు సరోగసి ద్వారా వెల్‌కమ్ చెప్పింది. అయితే ప్రజెంట్ నయన్ విడాకులు తీసుకోబోతుందన్న వార్త వైరల్ అవుతోంది. ‘తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీవల్ల’ అంటూ నయన్ పెట్టిందన్న పోస్ట్ వైరల్ అవుతోంది. నెక్స్ట్ స్టెప్ విడాకులే అనే చర్చ జరుగుతోంది.

అయితే ఈ పోస్ట్ నయనతార పెట్టలేదని.. ఎవరో కావాలనే ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని అంటున్నారు అభిమానులు. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలని హెచ్చరిస్తున్నారు. అయితే పోస్ట్ నయన్ పెట్టిందని.. కానీ మళ్లీ డిలీట్ చేసిందని ఇంకొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఇంతకు ముందు చాలా మందితో డేటింగ్ చేసి శివన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె.. హ్యాపీగా ఉందనుకున్న సమయంలో ఇలాంటి రూమర్స్ రావడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఓ స్టార్ హీరో పనేనని అనుమానిస్తున్నారు.

Next Story