- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిల్ రావిపూడికి బిగ్ షాకిచ్చిన నయనతార..
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) -అనిల్ రావిపూడి (Anil Ravipudi)కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) -అనిల్ రావిపూడి (Anil Ravipudi)కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara)హీరోయిన్‌గా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ మంచి బజ్ ఏర్పడింది. సినిమా విడుదలకు దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగం పెంచిన చిత్ర బృందం… తాజాగా ఓ సరదా వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేసింది. ఈ వీడియోలో నయనతార స్వయంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ అనిల్ రావిపూడిని ప్రశ్నించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
“సినిమా స్టార్టింగ్‌లో ఒక ప్రమోషనల్ వీడియో చేశాం కదా… మరి ఇప్పుడు ఏం చేయాలి?” అని నయనతార అడగడంతో, అనిల్ రావిపూడి ఒక్కసారిగా షాక్ అయినట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. దానికి వెంటనే ఆయన మీరు ప్రమోషన్స్ గురించి అడగడమే పెద్ద ప్రమోషన్ మేడమ్ అంటూ కామెడీగా సమాధానం ఇవ్వడం నవ్వులు తెప్పిస్తోంది. అంతటితో ఆగకుండా నయనతార “అయితే జనవరి 12న సినిమా వస్తోంది అని చెప్పాలా?” అని అడగగా… “అంతే చాలు” అంటూ అనిల్ చెప్పడం, చివర్లో “హలో మాస్టర్ ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి” అనే డైలాగ్‌తో వీడియో ముగుస్తుంది. ఈ చిన్న క్లిప్‌నే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నయనతార నేచురల్ యాక్టింగ్, అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ హ్యూమర్ కలిసి వీడియోకి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇలాంటి ప్రమోషనల్ ఐడియాలు అనిల్‌కే సాధ్యం”, “సింపుల్‌గా ఉన్నా బాగా కనెక్ట్ అయ్యే ప్రమోషన్”, “నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది” అంటూ కామెంట్లు పెడుతున్నారు.






