నేరం ఎన్నడూ ఇంత గొప్పగా కనిపించలేదు.. భయపెడుతున్న నవాజ్..

by Dishanational4 |
నేరం ఎన్నడూ ఇంత గొప్పగా కనిపించలేదు.. భయపెడుతున్న నవాజ్..
X

దిశ, సినిమా: స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ సరికొత్త అవతార్‌లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్న ఆయన.. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌ 'హడ్డీ' షూటింగ్ మొదలైనట్లు తెలిపాడు. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌లో మునుపెన్నడూ చూడని అవతార్‌లో అట్రాక్టింగ్‌గా కనిపించాడు. ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించిన నవాజ్.. బూడిదరంగు మెరిసే గౌను, పొడవాటి జుట్టుతో సోఫాలో వయ్యారంగా కూర్చున్నాడు. కానీ పక్కనే రక్తపు మరకలు, ఇనుప రాడ్ చూస్తుంటే భారీ యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ మాదిరిగా ఉండగా.. 'క్రైమ్‌కి కొత్త అవతార్. రివేంజ్ డ్రామా #Haddi చిత్రీకరణ ప్రారంభమైంది. 2023లో విడుదల కానుంది' అంటూ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న లుక్స్‌పై ప్రశంసలు కురిపిస్తు్న్న ఫ్యాన్స్.. 'వావ్ ! ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. మా మనసును కదిలించింది. నేరం ఇంతకు ముందెన్నడూ ఇంత గొప్పగా కనిపించలేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Next Story