మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ పొలిశెట్టి.. బాక్సాఫీసు వద్ద నవ్వుల జాతర ఖాయమా?

by Mallepaka Hamsa |

సాధారణంగా పెద్ద స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసే మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు నవీన్ పొలిశెట్టిలోని టాలెంట్‌ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను తీసుకురాబోతున్నట్లు టాక్.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ పొలిశెట్టి.. బాక్సాఫీసు వద్ద నవ్వుల జాతర ఖాయమా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి తన తదుపరి సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. ‘జాతిరత్నాలు’ మూవీతో బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం కురిపించిన నవీన్, ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో జతకట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన పలు పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా పెద్ద స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసే మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు నవీన్ పొలిశెట్టిలోని టాలెంట్‌ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను తీసుకురాబోతున్నట్లు టాక్. నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ ఇప్పటికే కథా చర్చలు పూర్తి చేసి, ప్రాజెక్ట్‌ను ఫైనలైజ్ చేశారట. నవీన్ ఎనర్జీకి తగ్గట్టుగా ఒక వైవిధ్యమైన కథను మైత్రీ సంస్థ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ద్వారా ఒక కొత్త తమిళ దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కాబోతుండటం విశేషం. సదరు దర్శకుడు చెప్పిన కథలోని కొత్తదనం, నవీన్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే కామెడీ ట్రాక్ మైత్రీ సంస్థకు, నవీన్‌కు బాగా నచ్చాయని సమాచారం. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ, స్క్రిప్ట్ చాలా పకడ్బందీగా ఉందని, నవీన్ మార్కు హ్యూమర్ ఇందులో పుష్కలంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నవీన్ పొలిశెట్టి సినిమాలంటేనే యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు వినోదంపై మినిమం గ్యారెంటీ ఉంటుంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ నుంచి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వరకు ప్రతి సినిమాలో వినోదానికి పెద్దపీట వేసిన నవీన్, ఈ కొత్త ప్రాజెక్ట్‌తో కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా పక్కా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సమాచారం.

Next Story