ఆ యంగ్ డైరెక్టర్‌తో నేచురల్ స్టార్ నాని సినిమా ఫిక్స్.. త్వరలో షూటింగ్ స్టార్ట్..

by Gugulothu.Kavitha |

నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ఆడియన్స్‌లో ఫుల్ మార్కులు సంపాదించుకున్నాడు.

ఆ యంగ్ డైరెక్టర్‌తో నేచురల్ స్టార్ నాని సినిమా ఫిక్స్.. త్వరలో షూటింగ్ స్టార్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అలా మొదలైంది’(Ala Modalaindi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే తెలుగు ఆడియన్స్‌లో ఫుల్ మార్కులు సంపాదించుకున్నాడు. రీసెంట్‌గా ‘సరిపోదా శనివారం’(saripoda Sanivaaram) సినిమాతో మన ముందుకు వచ్చి ఓకే ఓకే అనిపించుకున్నాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా నిర్మాతగా మారి పలు చిత్రాలు చేస్తున్నాడు. అలా చేస్తున్న సినిమాల్లో ‘హిట్-3’(HIT-3) ఒకటి. ఈ మూవీలో నాని హీరోగా అండ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే.

శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను యూనిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని(Prashanthi Tipirneni) నిర్మిస్తున్నారు. ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి(srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి టాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తుండగా.. మిక్కీ జె. మేయర్(Mickey J Meyer) సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా మే 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

అలాగే నాని ‘ది ప్యారడైజ్’(The Paradise) అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నేచురల్ స్టార్ నాని ఈ రెండు సినిమాలతో పాటు మరొక యంగ్ డైరెక్టర్‌కు చాన్స్ ఇచ్చాడని సమాచారం. ఇంతకీ అతను మరెవరో కాదండోయ్ శిబి చక్రవర్తి(Sibi Chakravarthy). ఈ యంగ్ డైరెక్టర్ హీరో నాని కోసం ఓ కథను సిద్ధం చేశాడట. అయితే నానిని కలిసి స్టోరీని వినిపించాడట.

ఇక కథ నచ్చడంతో నాని కూడా ఓకే చెప్పాడట. ఇక త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. కాగా నేడు నేచురల్ స్టార్ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story