జాతీయ అవార్డు గ్రహిత నటి ఉత్తరా బావోకర్ కన్నుమూత..

by Disha Web Desk 6 |
జాతీయ అవార్డు గ్రహిత నటి ఉత్తరా బావోకర్ కన్నుమూత..
X

దిశ, వెబ్ డెస్క్: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి, థియేటర్ ఆర్టిస్ట్ ఉత్తరా బావోకర్ (79) మృతి చెందారు. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బావోకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బావోకర్ మృణాల్ సేన్ యొక్క ‘ఏక్ దిన్ అచానక్’లో నటించి ఆమె ఉత్తమ సహాయ నటిగా 1988లో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఆమె ఆజా ‘నాచ్లే, జస్సీ జైస్సీ కోయి నహిన్, వంటి షోస్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. కాగా ఉత్తరా బావోకర్ యాత్ర, తమస్, రుక్మావతి కి హవేలీ, ది బర్నింగ్ సీజన్, ఉత్తరాయణ్, కోరా కాగజ్, సంహిత, ఎక్కీస్ తోప్పోన్‌కి సలామీ, దేవ్ భూమి వంటి చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి: హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్.. ఆందోళనలో ష్యాన్స్



Next Story

Most Viewed