- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
34ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 19ఏళ్ల కుర్ర నటుడు..
నసీరుద్దీన్ షా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. యూనిక్ యాక్టింగ్ స్టైల్‌తో అభిమానులను సొంతం చేసుకున్నారు. 75ఏళ్ల వయసులోనూ ప్రొఫెషనల్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. అయితే ‘And Then One Day: A Memoir’ అనే ఆత్మకథలో ఆయన

దిశ, వెబ్ డెస్క్ : నసీరుద్దీన్ షా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. యూనిక్ యాక్టింగ్ స్టైల్‌తో అభిమానులను సొంతం చేసుకున్నారు. 75ఏళ్ల వయసులోనూ ప్రొఫెషనల్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నారు. అయితే ‘And Then One Day: A Memoir’ అనే ఆత్మకథలో ఆయన పర్సనల్ విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా పందొమ్మిదేళ్ల వయసులో 34ఏళ్ల వైద్యురాలిని పెళ్లి చేసుకోవాలనుకున్న నిర్ణయాన్ని ఇందులో ప్రస్తావించాడు. 19ఏళ్ల యువకుడైన నసీరుద్దీన్ షా.. అప్పటికే విడాకులు తీసుకున్న డాక్టర్ పర్వీన్ మురాద్‌ను ప్రేమించాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఇందుకు కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అప్పటికే పిల్లలు ఉన్న ఆమెను ఎలా చేసుకుంటావనే వాదనలు వినిపించాయి.
ఎవరు ఏమన్నా వినిపించుకోకుండా, ఎన్నో కష్టాలు పడి పెళ్లి చేసుకుంటే.. ఈ వివాహం కేవలం కొద్ది నెలల్లోనే బ్రేక్ అయింది. పర్వీన్ పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లిపోయింది. దీంతో విడాకుల సమయంలో భారీ మొత్తంలో భరణం చెల్లించాలని డిమాండ్ చేసింది ఆమె కుటుంబం. మొత్తానికి అడిగిన డబ్బులు చెల్లించలేక చాలా యాతన పడిన నసీరుద్దీన్.. దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఈ వివాహం నుంచి చట్టపరంగా బయటకొచ్చారు. అయితే ఈ క్రమంలోనే రత్నా పాఠక్‌తో ప్రేమలో పడ్డాడు నటుడు. సొసైటీ ఒప్పుకోకపోయినా.. 1982 సమయంలోనే పెళ్లి కాకుండానే సహజీవనం చేశారు. ‘మసూమ్’ చిత్రం ద్వారా వచ్చిన రెమ్యూనరేషన్‌తో ఈ భరణాన్ని చెల్లించినట్లు రాసుకొచ్చాడు. ఆ తర్వాత రత్నా పాఠక్‌ను పెళ్లి చేసుకున్న ఆయన.. హాయిగా జీవిస్తున్నట్లు తెలిపారు.






