- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హాట్ బ్యూటీ.. ఆరు నెలల తర్వాత అలా దర్శమివ్వడంతో హాట్ టాపిక్‌గా మారిన వీడియో
బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri)గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. మోడల్‌గా పరిచయం అయి.. 2011లో ‘రాక్‌స్టార్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించింది.ఆ తర్వాత స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అంతేకాకుండా పలు చిత్రాల్లో ఐటమ్ గర్ల్‌గానూ చిందులేసింది.
ఇక తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హరి వీరమల్లు’(Hari Hari Veeramallu) చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల ఈ అమ్మడు ‘హౌస్‌ఫుల్-5’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నర్గీస్ ఫక్రీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముంబూలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో పాల్గొంది. ఇక ఈ వేడుకలకు బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ కూడా హాజరయ్యారు. నర్గీస్, ఫరా ఖాన్ రెడ్ కార్పెట్‌పై నిల్చొన ఉండగా.. అనంతరం ఫరా నీ భార్య పక్కకు వచ్చి నిల్చో అని టోవీని పిలిచింది.
దీంతో నర్గీస్ ఫక్రీ, టోవినికి పెళ్లి జరిగిపోయిందని తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరిద్దరు పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. వ్యాపారవేత్త టోనీ బేగ్(Tony Baig), నర్గీస్ అమెరికాలోని కాలిఫోర్నియాలో వివాహం చేసుకున్నట్లు టాక్. ఆ తర్వాత స్విట్జర్లాండ్’కు హనీమూన్‌కు వెళ్లగా.. వీరి పెళ్లి జరిగి ఆరు నెలల అవుతోంది. ఇక ఈ విషయాన్ని నర్గీస్ సీక్రెట్‌గా ఉంచడం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఇంత ముఖ్యమైన విషయాన్ని బయట పడకుండా జాగ్రత్త పడటానికి కారణాలేంటో అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు నెటిజన్లు.






