- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రణ్‌బీర్‌ను అలా చూసి ఆవారాగాడు అనుకున్నా.. నటి షాకింగ్ కామెంట్స్
యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ స్టార్‌డమ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది నటి నర్గీస్ ఫక్రీ.

దిశ, సినిమా : యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ స్టార్‌డమ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది నటి నర్గీస్ ఫక్రీ. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ అనుభవాలను షేర్ చేసుకున్న బ్యూటీ.. ‘రాక్‌స్టార్’ సినిమా కంటే ముందు రణ్‌బీర్ కపూర్ ఎవరో నిజంగా తనకు తెలియదని చెప్పింది. 2011లో రణ్‌బీర్ హీరోగా వచ్చిన ఈ మూవీతో బాలీవుడ్ అరంగేంట్రం చేసిన ఆమె.. ‘ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అతన్ని చూసి ఎవరో బాధ్యత లేని అబ్బాయి అనుకున్నా. డ్రెస్సింగ్, కళ్లద్దాలు చూస్తే అలాగే అనిపించింది. అయితే ‘రాక్‌స్టార్’ అవకాశంతో తన గురించి తెలిసి షాక్ అయ్యాను’ అని తెలిపింది. కానీ తర్వాత రణ్‌బీర్‌తో కలిసి పనిచేయడం ఒక ఆశీర్వాదంగా భావించానన్న నటి.. ‘అతనొక్కడే కాదు నాతో పనిచేసే వ్యక్తుల గురించి ఎక్కువగా తెలియనందున ఈ మూవీ సెట్, షూట్‌లో పెద్దగా ఎవరికీ భయపడలేదంటూ’ ఫన్నీ సన్నివేశాలను గుర్తు చేసుకుంది.






