‘కాంతార’ రేంజ్‌లో ‘నరకాసుర’ టీజర్..

by Disha Web Desk 9 |
‘కాంతార’ రేంజ్‌లో ‘నరకాసుర’ టీజర్..
X

దిశ, సినిమా: ‘నరకాసుర’ టీజర్ ‘కాంతార’ రేంజ్‌లో ఉందన్నాడు సినిమాటోగ్రాఫర్ సెంథిల్. టీజర్ చాలా అద్భుతంగా ఉందని కొనియాడిన డైరెక్టర్ వైవీఎస్ చౌదరి.. హీరో రక్షిత్ శెట్టికి మంచి భవిష్యత్ ఉందన్నాడు. సెబాస్టియన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంగీర్తన హీరోయిన్ కాగా సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలో విడుదల కాబోతోన్న ఈ చిత్రం అవుట్‌పుట్ అనుకున్న దానికంటే బెస్ట్‌గా వచ్చిందని తెలిపారు మేకర్స్. హీరో రక్షిత్ రెండున్నరేళ్లపాటు కథను నమ్ముకుని వర్క్ చేశాడని, స్టోరీకి అనుగుణంగా ఫిట్‌నెస్ మెయింటెన్ చేస్తూ చాలా కష్టపడ్డాడని ప్రశంసించారు. తప్పకుండా మూవీ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి:

షారుఖ్ నెక్స్ట్ సినిమా.. కమల్ హాసన్, అమితాబ్ మూవీస్‌ నుంచే వచ్చిందా..

Next Story

Most Viewed