విడుదలకు ముందే జాక్ పాట్ కొట్టిన నారా రోహిత్ ‘సుందరకాండ’ సినిమా..

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohit) ‘సోలో’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ స్టార్ హీరో కాలేకపోయాడు.

విడుదలకు ముందే జాక్ పాట్ కొట్టిన నారా రోహిత్  ‘సుందరకాండ’ సినిమా..
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నారా రోహిత్(Nara Rohit) ‘సోలో’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ స్టార్ హీరో కాలేకపోయాడు. ఇక గత ఏడాది ‘ప్రతినిధి-2’ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టిన ఆయన ఇటీవల ‘భైరవం’తో బ్లాక్ బస్టర్ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ తన 20వ సినిమా ‘సుందరకాండ’(Sundarakanda) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో దర్శకుడు వెంకటేష్ నిమ్మల పూడి(Venkatesh nimmalapudi) ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకల్లి నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా జాక్ పాట్ కొట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో రూ. 12 కోట్లను సాధించి సంచలనం సృష్టించింది. సుందరకాండ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ రూ. 12 కోట్లకు సొంతం చేసుకుంది. తెలుగు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ 9 కోట్లు, హిందీ డబ్బింగ్ అండ్ ఆడియో రైట్స్‌ను రూ. 3 కోట్లకు అమ్మేసి మొత్తం నాన్-థియేట్రికల్ 12 కోట్లు సాధించడం మామూలు విషయం కాదు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అసలు నాన్-థియేట్రికల్ బిజినెస్ చాలా కష్టమైపోయింది.

కానీ ఈ సినిమాను హాట్ స్టార్ కు చెందిన మూడు టీమ్స్ చూసి మరీ కంటెంట్ బాగా నచ్చడంతో మంచి రేటుకు తీసుకున్నారట. కంటెంట్ మీద నమ్మకంతో ‘సుందరకాండ’ టీం హాట్ స్టార్ ను సంప్రదించి సినిమాను చూపించి మరీ డీల్ క్లోజ్ చేయడం గమనార్హం. సినిమా రిలీజ్‌కు ముందే ఇంత నాన్ థియేట్రికల్ బిజినెస్ సాధించడం అంటే, సుందరకాండ కథ, కంటెంట్ లో ఏదో అద్భుతం ఉందని స్పష్టమవుతోంది. బలమైన కంటెంట్ ఉంటే ఓటీటీ సంస్థలు భారీగా వెచ్చించి కొనుగోలు చేస్తాయని నిరూపించింది ఈ ‘సుందరకాండ’. ఇక సుందరకాండ ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Next Story