The Paradise Glimpse : విమర్శల పాలవుతున్న నాని "ది ప్యారడైజ్" గ్లింప్స్

by Muthe.Rajitha |   (  Updated:2025-03-03 15:18:41  IST  )

నాచురల్ స్టార్ నాని(Nani), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్లో రాబోతున్న "ది ప్యారడైజ్"(The Paradise) సినిమా గ్లింప్స్(Glimpse) సోమవారం విడుదల అయిన విషయం తెలిసిందే.

The Paradise Glimpse : విమర్శల పాలవుతున్న నాని ది ప్యారడైజ్ గ్లింప్స్
X

దిశ, వెబ్ డెస్క్ : నాచురల్ స్టార్ నాని(Nani), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్లో రాబోతున్న "ది ప్యారడైజ్"(The Paradise) సినిమా గ్లింప్స్(Glimpse) సోమవారం విడుదల అయిన విషయం తెలిసిందే. 'ఇది కడుపుమండిన కాకుల కథ. అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ..' అంటూ సాగిన ఈ గ్లింప్స్ సాగుతుంది. నాని లుక్, డైలాగ్స్, అనిరుధ్(Anirudh) మ్యూజిక్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై, చెరుకూరి సుధాకర్ నిర్మాణంలో వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమా గ్లింప్స్ విడుదలైన కొద్ది గంటల్లోనే విమర్శల పాలవుతోంది. అందుకు కారణం ఈ గ్లింప్స్ లో వాడిన పదజాలం.

తల్లిని కించపరిచే బూతులు వాడటం ఏమిటని విమర్శకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కాగా నటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) డైరెక్షన్లో వచ్చిన భారీ హిట్ సినిమా "అర్జున్ రెడ్డి"(Arjun Reddy)లో వాడిన పదజాలంపై ఇండస్ట్రీలో, బయట విపరీతంగా ఆరోపణలు వచ్చాయి. ఆ సినిమాలో కూడా తల్లిని కించపరిచే మాటలు ఉండటం వలన తీవ్ర విమర్శలకు గురి కావాల్సి వచ్చింది. ఇక తాజాగా నాని, శ్రీకాంత్ కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ గ్లింప్స్ లో సైతం అలాంటి మాటలు ఉండటం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Next Story