నాని నమ్మకం నన్ను భయపెడుతోంది.. శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-24 05:51:54  IST  )

ఆ నమ్మకమే నన్ను ప్రతి సెకను భయపెడుతోంది.

నాని నమ్మకం నన్ను భయపెడుతోంది..  శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ‘దసరా’ వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని(nani)- శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise). ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్ గురించి, తనపై నాని ఉంచిన నమ్మకం గురించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. నేడు నాని పుట్టిన రోజు కావడంతో శ్రీకాంత్ ఓదెల విషెస్ తెలుపుతూ.. ఎమోషనల్ అయ్యారు. ‘‘నాని అన్న.. ఏదైనా అడిగినప్పుడు నువ్వు ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని అన్న ప్రతిసారీ.. అది నాకు ‘నిన్ను నేను నమ్ముతున్నాను’ అన్నట్లుగా వినిపిస్తుంది. ఆ నమ్మకమే నన్ను ప్రతి సెకను భయపెడుతోంది. అందుకే ఈ సినిమా కోసం నా రక్తాన్ని, ఆత్మను ధారపోస్తున్నాను. నీ చేతి మీద టాటూగా స్లర్ వేసుకోమని అడిగాను. నువ్వు ఓకే రా ని ఇష్టం అన్నావు.

నేను లెక్కలేనన్ని రీటేక్‌లతో నిన్ను ప్రతిరోజూ హింసిస్తాను... నువ్వు కేవలం - ఓకే రా ని ఇష్టం అని అంటున్నావు. కానీ ఇప్పుడు నేను ఒప్పుకోవాలి అన్నా. ఈ సినిమా కోసం నీ సినిమా రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేశాను. నీ వర్కింగ్ డేస్ ప్యాటర్న్‌ను, నీ రిలీజ్ డేట్ ప్లానింగ్‌ను కూడా మార్చాల్సి వచ్చింది. అయినా సరే నువ్వు నాపై చూపిస్తున్న ఆ నమ్మకం నన్ను మరింత బాధ్యతగా ఉంచుతోంది’’ అనిరాసుకొచ్చారు. ఒక స్టార్ హీరో అయి ఉండి, ఒక యంగ్ డైరెక్టర్‌కు ఇంతటి స్వేచ్ఛను ఇవ్వడం పట్ల నెటిజన్లు నానిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాని - శ్రీకాంత్ ఓదెల మధ్య ఉన్న ఈ బాండింగ్ చూస్తుంటే.. ‘ది ప్యారడైజ్’ చిత్రం ‘దసరా’ను మించిన పక్కా మాస్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. నాని కూడా ఈ సినిమా కోసం ఒక సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తున్నట్లు సమాచారం.

Next Story