నాని-సుజిత్ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్.. విలన్‌గా స్టార్ హీరో ఫిక్స్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుజిత్(Sujith), పవర్ స్టార్ కాంబోలో వచ్చిన ‘ఓజీ’ బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

నాని-సుజిత్ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్.. విలన్‌గా స్టార్ హీరో ఫిక్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుజిత్(Sujith), పవర్ స్టార్ కాంబోలో వచ్చిన ‘ఓజీ’ బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాకు సుజిత్ భారీ స్థాయిలో తెరకెక్కించి అభిమానులను మెప్పించారు. అంతేకాకుండా పలువురి స్టార్ హీరో ప్రశంసలు పొందుతున్నారు. ‘ఓజీ’ భారీ కలెక్షన్లు రాబడుతూ థియేటర్స్‌లో దూసుకుపోతుంది. ఈక్రమంలో.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ సుజిత్ నెక్ట్స్ సినిమా కూడా ఇదే జోష్‌లో ఫిక్స్ అయినట్లు సమాచారం. నేచురల్ స్టార్ నాని(nani)-సుజిత్ కాంబోలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రాబోతున్నట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు విజయదశమి నాడు సెప్టెంబర్ 2న నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ చిత్రంలో ‘ఓజీ’లో వర్క్ చేసిన వారు ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో పృథ్విరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) విలన్‌గా కనిపించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు.. ఇది ఒక మల్టీ స్టారర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వరుస హిట్స్ సాధిస్తూ దూసుకుపోతున్న నాని.. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎలా కనిపించబోతున్నాడనే దానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

link

Next Story