నాని ‘ది ప్యారడైజ్’ లో బాలీవుడ్ హీరో.. గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లే మూవీ అంటూ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-06 08:25:14  IST  )

నేచురల్ స్టార్ నాని(nani), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’(The Paradise).

నాని ‘ది ప్యారడైజ్’ లో బాలీవుడ్ హీరో.. గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లే  మూవీ అంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని(nani), శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’(The Paradise). ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుండగా.. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా, చిత్రబృందం ‘ది ప్యారడైజ్’ చిత్రంలో బాలీవుడ్ హీరో కూడా నటించబోతున్నట్లు తెలుపుతూ పోస్ట్ పెట్టారు.

ఇందులో యంగ్ హీరో రాఘవ్ జుయల్ జాయిన్ కాబోతున్నట్లు వెల్లడిస్తూ.. TheParadise ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. రాఘవ్ జుయల్ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. అలాగే కొన్ని సన్నివేశాలను చూసిన రాఘవ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. త్వరలో సెట్స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ విషయంపై రాఘవ్ స్పందిస్తూ.. ‘‘ది ప్యారడైజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీ అవుతుంది. తెలుగు సినిమాను గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లే స్కోప్ ఈ ప్రాజెక్ట్‌కి ఉంది. ఈ మూవీ కోసం నేను తెలుగు నేర్చుకుంటున్నా.

కాబట్టి నా పాత్రకు సంబంధించిన డబ్బింగ్ నేను చెప్పుకోగలను. ఇది నాకు పెద్ద సవాలు కానీ.. నా వందశాతం అందిస్తున్నాను. శ్రీకాంత్ ఓదెల మునుపటి సినిమా చూసిన వారెవరైనా అతని దృష్టిని తెలుసుకుంటారు. ఈ చిత్రంతో అతను చేస్తున్నది కూడా అనుభవించడానికి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు నా లుక్ కోసం వేచి ఉండండి. మీరు దీన్ని ఇష్టపడతారు” అని చెప్పుకొచ్చాడు.

link

Next Story