- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై వెళ్లిపోయిన బాలయ్య..కారణం ఇదే !
ముంబై వెళ్లిపోయిన బాలయ్య..దాదాపు 15 రోజుల పాటు అక్కడే ఉండనున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అగ్రశ్రేణి హీరోగా రాణిస్తున్న నందమూరి బాలయ్య, అటు రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. ఏజ్ పై బడినప్పటికీ, కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ దూసుకు వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం రెండు లేదా ఒక సినిమా అయినా రిలీజ్ చేసుకొని, సక్సెస్ అందుకుంటున్నారు. అయితే అలాంటి నందమూరి బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఊర మాస్ సినిమా తీస్తున్నారు.
NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరగనుంది. రేపటి నుంచి ఈ షూట్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ముంబైకి నందమూరి బాలయ్య చేరుకున్నట్లు టాక్ నడుస్తోంది. జూన్ 8 నుంచి 10వ తేదీ వరకు ఈ షూట్ ముంబై పరిసరాల్లోనే జరగనుందట. ముఖ్యంగా తాజ్ హోటల్ సరౌండింగ్స్ లో కూడా ఈ షూట్ జరగనున్నట్లు టాక్. అందుకే బాలయ్య ముంబైకి చేరుకున్నారట. అక్కడే ఓ విల్లాలో బస చేయనున్నారట బాలయ్య. ఈ మేరకు చిత్ర బృందం ఏర్పాట్లు కూడా చేసినట్లు టాక్.






