Nagarjuna: ఆ హీరోయిన్‌తో రొమాన్స్ అంటే గజగజవణికిపోయిన నాగార్జున.. కారణం ఇదేనా?

by Anjali |
Nagarjuna: ఆ హీరోయిన్‌తో రొమాన్స్ అంటే గజగజవణికిపోయిన నాగార్జున.. కారణం ఇదేనా?
X

దిశ, సినిమా: అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నటసామ్రాట్ నాగార్జున. ఇప్పటికి అదే ఫిట్‌నెట్‌ను మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. కింగ్ దాదాపు 80 కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నాగ్ నిర్మాతగా, ఉత్తమ నటుడిగా మొత్తం తొమ్మది నంది పురస్కారాలు, రెండు జాతీయ చలన చిత్ర పురస్కారాలు, మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ‘అన్నమయ్య, శిరిడీ సాయి, శ్రీరామదాసు, హథీరాం బావాజీ వంటి జీవిత చరిత్ర ఆధారిత మూవీల్లో నటించి మరింత ఫేమ్ దక్కించుకున్నారు. ఈ చిత్రాలు ఇప్పటికీ టీవీలో వస్తే భక్తి శ్రద్ధలతో వీక్షించే జనాలున్నారు.

అయితే కింగ్ నాగార్జున గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఎంతో మంది హీరోయిన్లతో రొమాంటిక్ గా నటించిన ఈ హీరో ఓ హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి మాత్రం తెగ భయపడిపోయారట. మరీ ఆ కథానాయిక ఎవరో కాదు.. అతిలోకసుందరి దివంగత శ్రీదేవి. అప్పటి యూత్ కలల రాణి. నాగార్జున అండ్ శ్రీదేవి కలయికలో ‘క్షణ క్షణం, గోవిందా గోవిందా’ రెండు సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. కాగా ఇందులో శ్రీదేవితో రొమాన్స్ సీన్స్‌తో నటించడానికి నాగార్జున భయపడిపోయేవారట. నాగార్జున కంటే ముందు తరం హీరోలతోనే నటించిన భామతో నటించడం కొంచెం ఎక్సైటింగ్‌గా ఫీల్ అయినప్పటికీ షూటింగ్ టైమ్‌లో తెలియకుండానే నాగార్జునకు వణుకొచ్చేదట

Advertisement

Next Story