- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రెండు భారీ ప్రాజెక్ట్స్‌కు పోటీగా విడుదల కాబోతున్న ‘నాగబంధం’.. థియేటర్స్‌లోకి ఎప్పుడు రానుందంటే?
విరాట్ కర్ణ(Virat Karna), అభిషేక్ నామా(Abhishek Nama) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘నాగబంధం’(Nagabandham).

దిశ, సినిమా: విరాట్ కర్ణ(Virat Karna), అభిషేక్ నామా(Abhishek Nama) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘నాగబంధం’(Nagabandham). ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఎన్ ఐ కే స్టూడియోస్ బ్యానర్స్‌పై కిషోర్ అన్నపు రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అవినాష్, జగపతి బాబు, జయ ప్రకాష్, మురళీ శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదలై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘నాగబంధం’ విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19న ఉగాది కానుకగా విడుదల చేయనున్నట్లు టాక్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం ది ప్యారడైజ్, పెద్ది వంటి భారీ ప్రాజెక్ట్స్‌కు పోటీగా వస్తుండటం గమనార్హం. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ‘ది ప్యారడైజ్’ వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కాబోతుంది. ఇక రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మార్చి 27న రాబోతుంది. ఈ రెండు ప్రాజెక్టులు ఒకరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.






