‘నాగబంధం’ కథ కాదు.. ఏ చరిత్ర పుస్తకాల్లో రాయని గాథ.. ప్రకనటతో అంచనాలు పెంచేసిన మూవీ టీమ్

by Mallepaka Hamsa |

ఈ కథను పూర్తిగా తెలుసుకుని రాయడానికి ఎన్నో నెలలు పట్టింది.

‘నాగబంధం’ కథ కాదు.. ఏ చరిత్ర పుస్తకాల్లో రాయని గాథ.. ప్రకనటతో అంచనాలు పెంచేసిన మూవీ టీమ్
X

దిశ, సినిమా: విరాట్ కర్ణ(Virat Karna) హీరోగా, అభిషేక్ నామా (Abhishek Nama)దర్శకత్వంలో రాబోతున్న పార్ ఇండియా చిత్రం ‘నాగబంధం’. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్‌ను విడుదల చేస్తున్నారు. ఇక శివరాత్రి పండుగ సందర్భంగా నేడు.. టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ఈవెంట్‌కి సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్‌గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో.. తాజాగా,మూవీ మేకర్స్ కీలక నోట్ విడుదల చేశారు. ‘‘నాగబంధం (Nagabandham)టీజర్‌ను మీ ముందుకు తీసుకురాబోతున్నాము. ఈ చిత్రం కేవలం రాసుకున్న కథ కాదు, ఏ చరిత్ర పుస్తకాల్లోనూ రాయని గాథ. ఈ కథను పూర్తిగా తెలుసుకుని రాయడానికి ఎన్నో నెలలు పట్టింది. ఈ స్టోరీ పూర్తిగా రాసిన తర్వాతే ఊపిరిపిల్చుకోగలిగాము. ఈ కథను తెరపై ఎక్కించడానికి ఎన్నో నిశ్చబ్దాలను ఎదుర్కొంటూ, ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాము.

అలసిపోయిన రాత్రులు గడిపాము

ఒక దర్శకుడిగా చెప్పాలంటే.. ఈ టీజర్ అనేది విజువల్ మాత్రమే కాదు.. అది మా ఊపిరిలో దాగిఉన్న శ్వాస. చాలాకాలం ఆ అంతరాత్మలో దాచుకుని మీ ముందుకు నిజంలా తీసుకొస్తున్న తొలి దృశ్యరూపం. మీరు చూసే ప్రతీ ప్రేమలోనూ మా కష్టం ఉంది. అది మీకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది. మాకు ఈ కథపై నమ్మకం, సనాతన ధర్మంపై విశ్వాసం, సినిమాపై ఉన్న ప్రేమే మా మార్గానికి ఎన్ని అడ్డంకులు ఎదరైనా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లింది. అలసిపోయిన రాత్రులు గడిపాము. ప్రశ్నలతో నిండిన రోజులు చూశాము. అయినా మేము ఆ ప్రశ్నల లోతులోకి తొంగి చూసి, వాటిని ఛేధిస్తూ ముందుకు సాగాము. మా ప్రయాణానికి వెన్నంటే ఉంటూ వెన్నెముకగా.. నిలిచిన మా నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.మేము కోరుకునేది ఒక్కటూ స్వచ్ఛమైన మనస్సుతో ఈ టీజర్‌ను చూడండి. మీ మనస్సును తాకితే మా కష్టానికి ప్రతిఫలం దక్కినట్లే’’ అని రాసుకొచ్చారు. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి నెలకొంది.

Next Story