- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NC-24లో నాగ చైతన్య లుక్ వైరల్.. వావ్ సో హ్యాండ్‌సమ్ అంటున్న నెటిజన్లు(ట్వీట్)
టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) ప్రస్తుతం ‘NC-24’ అనే మూవీలో నటించనున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) ప్రస్తుతం ‘NC-24’ అనే మూవీలో నటించనున్నాడు. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనిని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ సినిమాపై మరింత హైప్ పెంచేశాయి.
దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రంలో నాగ చైతన్యకు సంబంధించిన ఓ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. అందులో చై స్టైలీష్ లుక్‌లో గుబురు గడ్డంతో చేతిలో క్యాండిల్ పట్టుకుని కనిపించాడు. అంతేకాకుండా డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో సూపర్ అనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. అక్కినేని ఫ్యాన్స్ వావ్ చైతన్య భలే హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇది అఫీషియల్ పోస్టర్ అనుకుంటే బిర్యానిలో కాలేసినట్టే ఎందుకంటే నాగ చైతన్య ఫ్యాన్స్ అతని మీద అభిమానంతో వారు ఎడిట్ చేసిన ఫొటో కాబట్టి.






