శోభిత, సమంతతో నాగచైతన్య.. చర్చనీయాంశంగా మారిన ఫొటో!

by Mallepaka Hamsa |

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

శోభిత, సమంతతో నాగచైతన్య.. చర్చనీయాంశంగా మారిన ఫొటో!
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస విజయాలను దక్కించుకుని తన పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ పెళ్లి నాలుగేళ్లు కూడా నిలవకముందే.. విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోగా.. సమంత రాజ్ నిడిమోరుతో ఏడడుగులు వేసింది. ప్రస్తుతం ఎవరి జీవితాల్లో వాళ్లు ఫుల్ బిజీ అయిపోయారు.

ఈక్రమంలో.. తాజాగా, నాగచైతన్య సమంత, శోభితతో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారు మళ్లీ ఎందుకు కలిసారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అందులో ఉన్నది హీరోయిన్ సమంత కాదు.. శోభిత (Shobhita Dhulipala)చెల్లెలు. ఆమె పేరు కూడా సమంతనే కావడం గమనార్హం. అయితే శోభిత, నాగచైతన్య కంటే ముందే సమంత పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. పెళ్లైన ఏడాదికి మరదలు ఇంటికి వెళ్లిన నాగచైతన్య ఆమెతో ఫొటో తీసుకున్నాడు. భార్యను ఓ వైపు, మరదలిని ఓ వైపు పెట్టుకుని దిగడం అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న వారు సమంత అంటే మాజీ భార్య అనుకుని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కానీ సమంత అంటే శోభిత చెల్లెలు అని తెలుసుకుని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అత్తగారింట్లో నాగచైతన్య బాగానే ఎంజాయ్ చేస్తున్నాడన్న మాట అని కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. కాగా.. నాగచైతన్య సినిమాల విషయానికొస్తే.. కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృష కర్మ’ చేస్తున్నాడు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

link

Next Story