- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియదర్శి ‘ప్రేమంటే’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priyadarshi) ‘పెళ్లి చూపులు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు ప్రియదర్శి(Priyadarshi) ‘పెళ్లి చూపులు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి, తొలిప్రేమ, స్పైడర్, రంగుల రాట్నం, ఉన్నది ఒక్కటే జిందగీ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ‘మల్లేశం’ సినిమాతో హీరోగా మారిన ప్రియదర్శి వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 35 చిన్న కథ కాదు, బలగం, వంటి మూవీస్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఆయన ‘సారంగపాణి’ జాతకం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ మూవీ ఊహించిన విధంగా బాక్సాఫీసు వద్ద హిట్ సాధించలేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈక్రమంలో.. ప్రియదర్శి కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది.
ప్రియదర్శి, ఆనంది(Anandhi) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ప్రేమంటే’(Premante ) థ్రిల్ ప్రాప్తిరస్త్ ట్యాగ్‌లైన్‌తో రాబోతుంది. ఈ సినిమానకు సునీత్ శ్రీరామ్(Suneet Sriram) దర్శకత్వం వహిస్తుండగా.. లవ్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో రాబోతుంది. ఈ చిత్రాన్ని Svcllp ప్రజెంట్స్, స్పిరిట్ మీడియా బ్యానర్స్‌పై పుస్కుర రామ్ మోహన్ రావు, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అక్కినేని నాగచైతన్య చేతుల మీదుగా విడుదల చేయించారు.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ‘ప్రేమంటే’ మూవీ వీడియోను షేర్ చేశారు. ‘‘ఈ మూవీ పోస్టర్‌ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రేమ, హాస్యం, థ్రిల్ మీతో ఉండిపోవడానికి రెడీగా ఉంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘ప్రేమంటే’ ఫస్ట్ లుక్ విషయానికొస్తే.. ప్రియదర్శి, ఆనంది ఓ కిటికీ దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ కనిపిస్తారు. ఆనంది కాలును ప్రియదర్శి కడుపుపై వేసి ఉండగా.. ఆయన నవ్వుతూ ఆమెను చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రియదర్శితో ఆనంది నటిస్తుండటం తెలిసి కొంతమంది నెటిజన్లు షాక్ అవుతున్నారు.






