- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా పోరాటానికి ఫలితం దక్కింది.. విడుదలకు ముందే ‘రాచెల్’ మూవీకి అవార్డు రావడంపై హనీరోజ్ ఎమోషనల్ పోస్ట్
ఈ రోజు ఉదయం నేను నిద్రలేవగానే ఈ వార్త నన్ను పలకరించింది. ఇది నా కెరీర్‌లోనే మొట్టమొదటి అవార్డు. ఈ పురస్కారం అందుకోవడం నాకు అమితానందాన్ని ఇస్తోంది.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాతో తెలుగు కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్. తనదైన అందం, అభినయంతో మెప్పించిన ఈ హాట్ బ్యూటీ, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టాన్ని చేరుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘రాచెల్’ సినిమాకు గాను కేరళ 49వ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో ‘సెకండ్ బెస్ట్ యాక్ట్రెస్’ (2025) పురస్కారం లభించింది. ఈ అద్భుతమైన వార్తను హనీ రోజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. "ఈ రోజు ఉదయం నేను నిద్రలేవగానే ఈ వార్త నన్ను పలకరించింది. ఇది నా కెరీర్‌లోనే మొట్టమొదటి అవార్డు. ఈ పురస్కారం అందుకోవడం నాకు అమితానందాన్ని ఇస్తోంది. ఈ పాత్ర కోసం నా హృదయాన్ని, ఆత్మను ధారపోసి పనిచేశాను. చిత్రశుద్ధితో చేసిన పోరాటానికి ఫలితం దక్కింది.
నాపై నమ్మకం ఉంచి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ‘రాచెల్’ చిత్ర బృందానికి, ముఖ్యంగా దర్శకురాలు అనందిని బాలా గారికి నా కృతజ్ఞతలు. త్వరలోనే థియేటర్లలో ‘రాచెల్’చిత్రాన్ని మీరందరూ చూడటం కోసం నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ఆమె పేర్కొన్నారు. అనందిని బాలా దర్శకత్వంలో, బాద్‌షా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా, ఒక కసాయి కుమార్తె తన అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ ఎలా పగ తీర్చుకుంది అనే ఇతివృత్తంతో ఈ కథ సాగుతుంది. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో కనిపించిన హనీ రోజ్, ఈ సినిమాలో కసాయిగా, అత్యంత భయంకరమైన యాక్షన్ అవతార్‌లో కనిపించబోతుండటం విశేషం. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, విడుదల కాకముందే ఈ చిత్రానికి అవార్డు దక్కడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.






