- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నం అయింది.. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది.. హేమ ఎమోషనల్ కామెంట్స్
ఆ కేసు వల్ల నేను అనుభవించిన మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఒకానొక దశలో చచ్చిపోవాలని కూడా అనిపించింది. అంతలా ఆ ఆరోపణలు నన్ను కుంగదీశాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ, గత కొంతకాలంగా తనపై వస్తున్న డ్రగ్స్ కేసు ఆరోపణలు, ఎదుర్కొన్న అవమానాలపై తాజాగా, స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమానికి హాజరైన ఆమె, తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో వైరల్‌గా మారాయి. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు వచ్చినప్పటి నుంచి అనుభవించిన నరకాన్ని హేమ వివరించారు. "ఆ కేసు వల్ల నేను అనుభవించిన మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఒకానొక దశలో చచ్చిపోవాలని కూడా అనిపించింది. అంతలా ఆ ఆరోపణలు నన్ను కుంగదీశాయి" అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని నమ్మానని, అందుకే న్యాయస్థానం తనను నిర్దోషిగా ప్రకటించినప్పుడు ఊపిరి పీల్చుకున్నానని ఆమె స్పష్టం చేశారు.
నిర్దోషి అని తేలినప్పటికీ, సమాజంలో ఇంకా తనపై విమర్శలు రావడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకోకుండా తనపై బురదజల్లాయని హేమ ఆరోపించారు. ఆ నిరాధార వార్తల వల్ల తన వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నం అవ్వడమే కాకుండా, తన కుటుంబ సభ్యులు సమాజంలో తలదించుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. "నా కుటుంబం ఈ విషయంలో చాలా నలిగిపోయింది. మా అందరికీ ఇది ఒక కఠినమైన కాలం" అని ఆమె చెప్పారు. అయితే మీడియా మొత్తాన్ని తప్పు పట్టలేమని, నిజాయితీగా ఉండే సంస్థలు తనకు అండగా నిలుస్తాయని నమ్ముతున్నట్లు తెలిపారు. తన పోరాటంలో భవిష్యత్తులో కూడా మీడియా న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






