- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ స్టార్ వల్లే నా జీవితం నాశనం అయింది.. దుమారం రేపుతున్న స్టార్ హీరోయిన్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా(Manisha Koirala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా(Manisha Koirala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేపాల్ లో కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్ కొయిరాలా. తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా నేపాల్ కు 22వ ప్రధాన మంత్రిగా పని చేశాడు. అయితే మనీషా నటనపై ఆసక్తితో 1991లో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించి విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక ఇండియన్(Indian), బొంబై(Bombay), లస్ట్ స్టోరీస్ వంటివి ఆమెకు బాగానే పేరు తెచ్చిపెట్టాయి.తెలుగు, హిందీ, తమిళ భాషల్లో చాలా సినిమాలు చేసిన మనీషా సౌత్ ఇండస్ట్రీకి కొద్ది కాలంగా దూరంగా ఉంటుంది.
అక్కడ అవకాశాలు రాకపోవడంతో వచ్చిన చాన్సులు ఓకే చేస్తోంది. చివరగా ఆమె.. ‘షేహ్‌జాదా’తో ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా కోయిరాలా రజినీకాంత్(Rajinikanth) వల్లే తన కెరీర్ నాశనం అయినట్లు సంచలన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బాబా చిత్రం విడుదలై ఫ్లాప్ అయింది. దాంతో నేనే చాలా నష్టపోయాను. ఈ మూవీ డిజాస్టర్ తర్వాత సౌత్‌లో ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయి. అంతకు ముందు మాత్రం భారీగా దక్షిణాది నుంచి సినిమా ఆఫర్లు వచ్చేవి’’ అని అనడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పలు పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.






