- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శోభిత, జైనబ్‌ల వల్లే నా జీవితం ఇలా మారిపోయింది.. అసలు నిజాలు బయటపెట్టిన అమల!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమల(amala) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమల(amala) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చివరిగా ‘ఒకే ఒక జీవితం’(Oke Oka Jeevitham)చిత్రంలో నటించింది. గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇక 36 ఏళ్ల తర్వాత అమల, నాగార్జున కాంబోలో వచ్చిన ‘శివ’రీరిలీజ్ కావడంతో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. తాజాగా, అమల అన ఇద్దరు కోడళ్లు శోభిత(Shobitha), జైనబ్(Zainab)ల వల్ల తన జీవితంలో చాలా మార్పులు వచ్చినట్లు తెలిపింది. ‘‘నేను అత్తను కావడం అద్భుతమైన అనుభవం. నా కోడళ్లు మంచి మనసున్నవారు. నాగచైతన్య భార్య నా పెద్ద కోడలు చాలా టాలెంటెడ్ పర్సన్, సున్నితమైన వ్యక్తిత్వంతో పాటు నాపై చాలా ప్రేమను చూపిస్తుంది. ఆమెతో చాలా సమయం గడపడం నాకు ఆనందంగా అనిపిస్తుంది.
అలాగే జైనబ్ కూడా చాలా మంచిది. పోటీపడి ముందుకు సాగేందుకే ప్రయత్నిస్తూ.. చాలా కష్టపడుతుంది. శోభిత, జైనబ్‌లు మా ఇంట్లో ఉంటే, నవ్వులు, అల్లరితో పాటు పాజిటివిటీతో నిండిపోతుంది. ఆ ఇద్దరు నాకు కోడళ్లు కాదు కూతుర్లుగా నడుచుకుంటారు. ఈ బంధం నా జీవితంలో ఒక ముఖ్యమైన భాద్యతగా భావిస్తున్నాను. ఆ ఇద్దరి వల్ల నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. శోభిత సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్యతో పెళ్లి అయిన కానుంచి ఇంట్లోనే ఉంటోంది. ఇంతకు బోల్డ్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆమె మొత్తానికే ఇండస్ట్రీకి దూరం అయింది. మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు ఓ తమిళ సినిమాలో అవకాశం అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. కానీ దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అలాగే శోభిత కూడా సినిమాలతో పాటు సోషల్ మీడియాకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.






