- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన వల్లే నా జీవితం ఇలా అయింది.. అస్సలు ఊహించలేదంటూ త్రిప్తి డిమ్రి ఎమోషనల్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ‘యానిమల్’ చిత్రంతో ఊహించని విధంగా పాపులారిటీ దక్కించుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ‘యానిమల్’ చిత్రంతో ఊహించని విధంగా పాపులారిటీ దక్కించుకుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసింది. ఇక ఇందులో త్రిప్తి చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. ఆ తర్వాత నుంచి వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ ఫామ్‌లో త ఉంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనే మరోసారి నటించనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘స్పిరిట్’ (Spirit)చిత్రంలో నటిస్తోంది. ఇందులో త్రిప్తిని ఫైనల్ చేస్తున్నట్లు అధికారికంగా కూడా ప్రకటన చేశారు చిత్రబృందం. ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి డిమ్రి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘యానిమల్ తర్వాత నా జీవితం 360 డిగ్రీల మలుపు తీసుకుంది. ఇది నిజంగా ఒక వరం. లైలా మజ్ను సమయంలో నాకు లభిస్తుందని నేను భావించా కానీ ఈ గుర్తింపు వాస్తవానికి ‘యానిమల్’తో వచ్చింది. జోయా పాత్ర వల్ల ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఇది చాలా చిన్న పాత్ర కాబట్టి, నావల్ల ఏం అవుతుంది.. నాకేం ఫేమ్ వస్తుందని నేను భావించాను. కానీ దర్శకుడు సందీప్ (రెడ్డి వంగా) సర్ నాపై నమ్మకం ఉంచారు.
ఈ సినిమా నాకు చాలా మంచిదని అతను నాకు చెప్పినట్లుగానే హిట్ వచ్చింది. ఇది చాలా ఆశీర్వాదం. ఆ తర్వాత నాకు చాలా ప్రేమ లభించింది. యానిమల్ కారణంగా, ప్రజలు తిరిగి వెళ్లి నా మునుపటి చిత్రాలైన బల్బ్‌బుల్, ఖాలా, లైలా మజ్ను చూశారు. ఈ విషయం నాకు చాలా సంతోషంగా అనిపించింది. మరోసారి సందీప్ సర్ దర్శకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. చాలా ఎక్జైటింగ్‌గా ఉంది. ‘స్పిరిట్’ షూట్ కంప్లీట్ చేసి త్వరలోనే మీ ముందుకు వస్తాను’’ అని చెప్పుకొచ్చింది.






