నా కష్టకాలం ముగిసింది.. Samantha ఎమోషనల్ నోట్

by Disha Web Desk 7 |
నా కష్టకాలం ముగిసింది.. Samantha ఎమోషనల్ నోట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుందని తెలిసినప్పటి నుంచి అభిమానులు బాధపడిపోతున్నారు. కాగా తాజాగా తాను పర్ఫెక్ట్‌ అయిపోయానని చెప్పుకొచ్చింది. ఏడాదిగా ఎదుర్కొన్న ఇబ్బందులను తలుచుంటూ ఫొటోలు షేర్ చేసిన సామ్.. 'డీప్ బ్రీత్ తీసుకో పాప. త్వరలో అన్నీ సర్దుకుంటాయి.

ఏడు నుంచి ఎనిమిది నెలలుగా వరెస్ట్ డేస్ చూశావ్. ఒక అడుగు వేసి మరో అడుగు వేసేందుకు కష్టపడ్డావ్. అయినా సరే నీ పని నువ్వు పూర్తిచేసుకొచ్చావు. ఆ క్లిష్ట పరిస్థితులు ఎలా ఎదుర్కొన్నావో జీవితాంతం గుర్తుంచుకో. ఈ విషయంలో గర్వంగా ఉండు. నువ్వు స్ట్రాంగ్' అని రాసుకొచ్చింది. కాగా దీనిపై స్పందిస్తున్న అభిమానులు.. అందుకే నువ్వు మాకు ఇన్‌స్పిరేషన్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

సల్మాన్‌ ఖాన్‌కు నష్టం జరుగుతుందా..? భయపడుతున్న తండ్రి



Next Story