నా ఫ్యామిలీ నన్ను డబ్బు మిషన్‌లా వాడుకుంది: సంగీత

by samatah |   (  Updated:2023-05-25 06:47:39  IST  )

టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా ఒక ఊపు ఊపిన నటి సంగీత. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి వరుస చిత్రలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీత తన వ్యక్తిగత జీవితం, తన కుటుంబం గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.

నా ఫ్యామిలీ నన్ను డబ్బు మిషన్‌లా వాడుకుంది: సంగీత
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా ఒక ఊపు ఊపిన నటి సంగీత. ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి వరుస చిత్రలో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీత తన వ్యక్తిగత జీవితం, తన కుటుంబం గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. ‘నా ఫ్యామిలీలో అమ్మ, ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. నా అన్నదమ్ములు మద్యానికి బానిసై లైఫ్ నాశనం చేసుకున్నారు. వాళ్ల అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు కోసం నన్ను హీరోయిన్ చేసి ఒక మనీ మిషన్‌లా వాడుకున్నారు. హీరోయిన్ అవడం నాకు ఇష్టం లేదు. నా డబ్బులు జల్సా చేస్తూ.. నా గురించి బయట చెడుగా చెప్పేవారు. నా తల్లి కూడా అలాంటిదే. అందుకే నా తల్లిలాంటి తల్లి ఎవరికి ఉండకూడదు’ అని తెలిపింది.

Also Read..

తేజగారి డైరెక్షన్‌లో లాంచ్ కావడం నా అదృష్టం: geethika tiwary

Next Story