- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్లుగా నా ధ్యాసంతా దానిపైనే.. స్టార్ హీరో మూవీపై లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కాంబినేషన్‌లో రాబోతున్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం ‘కూలీ’(Coolie).

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కాంబినేషన్‌లో రాబోతున్న హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం ‘కూలీ’(Coolie). ఈ మూవీలో ఆమిర్ ఖాన్, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్, పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా,ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కనగరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘రెండేళ్ల నుంచి నాకు ‘కూలీ’ సినిమా గురించి తప్ప మరే ధ్యాస లేదు. కనీసం కుటుంబం, ఫ్రెండ్స్ సరదాలు ఏమీ లేవు. నా మొత్తం దృష్టంతా ఈ చిత్రంపైనే పెట్టాను. చివరికి నా 36, 37వ పుట్టినరోజులను కూడా జరుపుకోలేదు. నెలల తరబడి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉన్నాను. రజనీ సర్ సినిమా విషయం కొంచెం కూడా నేను పరధ్యానంతో ఉండకూడదని కఠిన నిర్ణయం తీసుకున్నాను. ఈ కథకు, సినిమాకు నేను అంతలా వశమైపోయాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు లోకేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.






