- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలవంతంగా కూర్చోబెట్టి చూడమన్నా నా పిల్లలు నా సినిమాలు చూడరు : కాజోల్
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అందరికీ సుపరిచితమే. ఒకానొక సమయంలో స్టార్ హీరోలతో ఎన్నో అద్భుతమైన ప్రేమ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిది.

X
దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అందరికీ సుపరిచితమే. ఒకానొక సమయంలో స్టార్ హీరోలతో ఎన్నో అద్భుతమైన ప్రేమ కథా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిది. ఇక తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి.. ఇటు సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు పంచుకుంది. ‘ నేను సినిమాల్లో నటించడం నా పిల్లలకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే నేను తీసిన సినిమాలను అసలు చూడరు. వారిని బలవంతంగా కూర్చోబెట్టి చూపించినా చూడరు. నా పిల్లలు మాత్రమే కాదు మా బంధువులలో చాలామంది నా సినిమాలను చూడటానికి ఇష్టపడరు’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More: ఎట్టకేలకు పెళ్లి పీఠలెక్కబోతున్న హృతిక్-సబా అజాద్? నెట్టింట న్యూస్ వైరల్
Next Story






