నా బాయ్‌ఫ్రెండ్ హృతిక్‌ను చూసి భయపడిపోయాడు.. అందుకే బ్రేక్ అయిందంటూ మృణాల్ షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |

తనను తాను నిరూపించుకోవడానికి జిమ్‌లో కఠిన కసరత్తులు చేసి ఏకంగా 20 కిలోల బరువు తగ్గాడని మృణాల్ వెల్లడించింది.

నా బాయ్‌ఫ్రెండ్ హృతిక్‌ను చూసి భయపడిపోయాడు.. అందుకే బ్రేక్ అయిందంటూ మృణాల్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఒక రిలేషన్‌షిప్‌లో అభద్రతా భావం ఎంతటి ప్రమాదకరమో వివరిస్తూ.. తన మాజీ ప్రియుడి వింత ప్రవర్తన వల్లే తన బంధం ముగిసిందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan)సరసన 'సూపర్ 30' సినిమాలో నటిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఆ సమయంలో ఒక వ్యక్తితో ప్రేమలో ఉండేదాన్ని అని.. అయితే, గ్రీక్ గాడ్ లాంటి హృతిక్ పక్కన తానునటించడం చూసి, అతను తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడని చెప్పింది. ‘‘తను ఒక స్టార్ హీరో సరసన నటిస్తోంది.. నేనెక్కడ వెనుకబడిపోతానో’’ అనే భయంతో తనను తాను నిరూపించుకోవడానికి జిమ్‌లో కఠిన కసరత్తులు చేసి ఏకంగా 20 కిలోల బరువు తగ్గాడని మృణాల్ వెల్లడించింది.

అయితే ఆ ప్రయత్నం ఎంతో కాలం సాగలేదు. కొన్ని రోజులకే అతను మళ్ళీ బరువు పెరగడం చూసి ఆశ్చర్యపోయానని పేర్కొంది. ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించగా.. ‘‘నీ చుట్టూ ఉండే సినీ స్టార్లతో నేను పోటీ పడాలనుకున్నాను, వాళ్లలా మారాలని ప్రయత్నించాను. కానీ నా వల్ల కావడం లేదు. అందుకే జిమ్ మానేశాను’’ అని అతను నిరాశగా సమాధానమిచ్చాడని.. అందం, ఫిట్‌నెస్ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం వల్ల అతను ఎంతటి మానసిక వేదనకు గురయ్యాడో తన కళ్లతో చూశానని మృణాల్ పేర్కొంది. నేను ఆ బంధంలో ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ, తనను తాను ఇతరులతో పోల్చుకునే అతని బలహీనతే తాము విడిపోవడానికి కారణమైందని మృణాల్ ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం సౌందర్యం కోసం పాకులాడుతూ మనిషి తన వ్యక్తిత్వాన్ని ఎలా కోల్పోతాడో తన మాజీ ప్రియుడి ఉదాహరణతో ఆమె వివరించింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story