ఆ స్టార్ హీరోతో కలిసి నటించడం నా అతిపెద్ద కల: రితికా నాయక్

by Mallepaka Hamsa |

అల్లు అర్జున్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అతిపెద్ద కల. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే నేను అస్సలు వదులుకోను.

ఆ స్టార్ హీరోతో కలిసి నటించడం నా అతిపెద్ద కల: రితికా నాయక్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ రితికా నాయక్(Ritika Nayak) ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చాలా తక్కువ సినిమాలే చేసినప్పటికీ, తన క్యూట్ లుక్స్, అద్భుతమైన నటనతో కుర్రాళ్ల మనసు దోచుకుంది. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చిన్నది, మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా వచ్చిన ‘మిరాయ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని, టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. ప్రస్తుతం రితికా నాయక్ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. యాక్షన్, డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో రితికా రేంజ్ పెరగడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇక సినిమాలతో బిజీగా ఉన్న రితికా, తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన మనసులో మాటను బయటపెట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ‘‘అల్లు అర్జున్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అతిపెద్ద కల. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే నేను అస్సలు వదులుకోను. ఆ అవకాశం వస్తే అది చిన్న పాత్ర అయినా సరే, చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ అంటే తనకు అంత ఇష్టమని, ఆయన ఎనర్జీ, డ్యాన్స్ అంటే పడిచస్తానని తెలిపింది. రితికా నాయక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ ఈ కామెంట్స్‌ను షేర్ చేస్తూ.. పుష్పరాజ్ సినిమాలో రితికాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన క్యూట్ నటనతో ఇప్పటికే మార్కులు కొట్టేసిన ఈ భామ, ఒకవేళ బన్నీ సినిమాలో కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద రచ్చ మామూలుగా ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Next Story