- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్నాభాయ్ బర్త్ డే స్పెషల్.. ‘ది రాజా సాబ్’ సినిమాపై హైప్ పెంచుతున్న పోస్టర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచి బొట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం అప్డేట్స్ ఇస్తోంది. తాజాగా, బాలీవుడ్ స్టార్ నటుడు పుట్టినరోజు కావడంతో విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ మూవీలో మున్నాభాయ్ సంజయ్ దత్ సంజు బాబా పాత్రలో నటిస్తున్నారు. రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన భారీగా పెరిగిన తలవెంట్రుకలు, గడ్డంతో కనిపించి హైప్ పెంచారు. ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రభాస్ తాత పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






