- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ.. హై ఓల్టేజ్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘భైరవం’(Bhairavam).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘భైరవం’(Bhairavam). ఇందులో మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రంగా వచ్చింది. ఈ సినిమా తమిళ హిట్ ‘గరుడన్’ ఆధారంగా విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) తెరకెక్కించారు. జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మించారు. ఆదితి శంకర్(Aditi Shankar), దివ్య పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 30న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
బాక్సాఫీసు వద్ద హిట్ సాధించలేకపోయింది. తాజాగా, ‘భైరవం’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు అధికారిక ప్రకటన విడుదల అయింది. ఈ సినిమా హక్కుల్ని ప్రముఖ ఓటీటీ జీ5 సొంతం చేసుకోగా.. జూలై 18నుంచి తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘పవర్‌ఫుల్, ఇంటెన్స్ మిమ్మల్ని మళ్ళీ ఆలోచించేలా చేసే కథ. ఈ హై ఓల్టేజ్ థ్రిల్లర్ ‘భైరవం’ కోసం రెడీగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






