- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుష్క శర్మపై మృణాల్ సంచలన వ్యాఖ్యలు.. ఇక నువ్వు మారవా అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు (వీడియో)
యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఫుల్ ఫేమ్ వచ్చాక పలు వివాదాస్పద కామెంట్లు చేస్తూ నెగెటివిటీని ఎదుర్కొంటుంది. సినిమాలతో కంటే అమ్మడు వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దీంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మృణాల్ ప్రముఖ నటి బిపాసా బసును బాడీ షేమింగ్ చేసి విమర్శలు ఎదుర్కొంది. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో మృణాల్ ఆమెకు క్షమాపణలు కూడా చెప్పింది. ఈ సంఘటన మరువముందే... ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్‌పై మృణాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘బాలీవుడ్‌లో నాకు ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చింది.
కానీ నేను దాన్ని రిజెక్ట్ చేశాను. ఒకవేళ అప్పుడు నేను ఆ సినిమా చేసి ఉంటే.. నన్ను నేను కోల్పోయేదాన్ని కావచ్చు. అలాగే ఎన్నో అవకాశాలు మిస్ అయ్యేవి. ఈ మూవీ సూపర్ హిట్ అయిన తర్వాత అందులో చేసిన హీరోయిన్‌కు స్టార్‌డమ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమే ఇండస్ట్రీలో లేదు. సినిమాలు చేయడం లేదు. ఇండస్ట్రీలో నేను విజయం సాధించాను. ఎందుకంటే నాకు తక్షణ సంతృప్తి, తక్షణ గుర్తింపు, తక్షణ కీర్తి అవసరం లేదు ఎందుకంటే వచ్చే ఏదైనా తక్షణమే పోతుంది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు మృణాల్ ఈ కామెంట్స్ అనుష్క శర్మ(Anushka Sharma)ను ఉద్దేశించే అన్నదని ట్రోల్ చేస్తున్నారు. నువ్వు ఇక మారవా ఒక స్టార్ హీరోయిన్ తలుచుకుంటే ఎప్పుడైనా నటించగలతు.. నీకు ఆమెలా పాపులారిటీ ఉందా ఉందా అని అంటున్నారు.






