Mrunal Thakur: లక్ అంటే ఈ అందాల తారదే.. ఏకంగా ఈమె చేతిలో 33 కోట్లు ?

by velandi.Saikiran |   (  Updated:2025-08-08 08:36:39  IST  )

మృణాల్ ఠాకూర్ 33 కోట్లు ఇండస్ట్రీ ద్వారా సంపాదించారట.హాయ్ నాన్నకు కోటి రూపాయలు, ఫ్యామిలీ స్టార్ కోసం 3 కోట్లు

Mrunal Thakur: లక్ అంటే ఈ అందాల తారదే.. ఏకంగా ఈమె చేతిలో 33 కోట్లు ?
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో మృణాలు టాగూర్ ఒకరు. అలాంటి బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur) 2014లో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగులో 2022 సంవత్సరంలో వచ్చిన సీతారామం ( Sita Ramam) సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో చీరకట్టులో కనిపించి సీత పాత్రలో మెరిసింది.

ఆ తర్వాత తెలుగులో వరుసగా ఆమెకు అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం డైకాట్ సినిమాలో నటిస్తున్నారు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అయితే ప్రస్తుతం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆస్తుల వివరాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె ఇప్పటి వరకు 33 కోట్లు సినిమా ఇండస్ట్రీ ద్వారా సంపాదించారట. అంతేకాదు మొదట తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని ఇప్పుడు.. ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్లు అందుకుంటున్నారట.

అలా నెలకు 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఈ అందాల తార సూపర్ 30 సినిమాకు కోటి కంటే తక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అంటే లక్షల్లో ఈ సినిమాకు చార్జ్ చేశారన్నమాట. ఇక ఆమె కెరియర్ లో సీతారామం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం మొత్తం 85 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు సీత. ఇక హాయ్ నాన్న సినిమాకు కోటి రూపాయలు, ఫ్యామిలీ స్టార్ కోసం మూడు కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు సన్నాఫ్ సర్దార్ 2 కోసం రెండు నుంచి ఐదు కోట్లు తీసుకుంటున్నారట. ఇలా మొత్తంగా 33 కోట్లకు పైగా ఆస్తులను సంపాదించారట మృణాల్ ఠాకూర్.

Next Story