గుడ్ న్యూస్ చెప్పిన మృణాల్ ఠాకూర్.. వాలెంటైన్స్ డే సందర్భంగా మా లవ్ స్టోరీ రివీల్ కాబోతుందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుని ఇండస్ట్రీలో రాణిస్తోంది యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).

గుడ్ న్యూస్ చెప్పిన మృణాల్ ఠాకూర్.. వాలెంటైన్స్ డే సందర్భంగా మా లవ్ స్టోరీ రివీల్ కాబోతుందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుని ఇండస్ట్రీలో రాణిస్తోంది యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). మొదట సాంప్రదాయ లుక్స్‌తో కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. హిందీ, తెలుగు, భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ తన గ్లామర్ లుక్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న మృణాల్ వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం మృణాల్ తెలుగులో ‘డెకాయిట్’ చేస్తోంది. అలాగే హిందీలో కూడా ఓ సినిమాలో నటిస్తుంది. ఈక్రమంలో.. తాజాగా, మృణాల్ ఓ కొత్త ప్రాజెక్ట్‌లో భాగం అయినట్లు ప్రకటించింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు జీ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్‌లో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

‘దో దివానే షెహర్ మే’ (DoDeewane seher Mein)అనే టైటిల్‌తో రాబోతుండగా.. ఇందులో సిద్ధాంత్ చతుర్వేది(Siddhant Chaturvedi) హీరోగా కనిపించబోతున్నాడు. ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమాకు రవి ఉద్యవార్ దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ, ప్రేరణ సింగ్, ఉమేష్ కుమార్ బన్సాల్, భరత్ కుమార్‌లు నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 20న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మృణాల్ ఓ వీడియోను షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు.. వావ్ సూపర్ జోడీ.. కెమిస్ట్రీని బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు వేచి ఉండలేకపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు.

Next Story