- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో వివాదంలో మృణాల్ ఠాకూర్..
మృణాల్ ఠాకూల్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన బ్యూటీ.. సక్సెస్ ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తుంది. నటిగా మాత్రమే కాదు వినయ విధేయతలకు కూడా ప్రశంసలు అందుకుంది. కానీ ఓల్డ్ వీడియోతో మరోసారి వివాదంలో చిక్కుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : మృణాల్ ఠాకూల్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన బ్యూటీ.. సక్సెస్ ఫుల్ కెరీర్‌ను కొనసాగిస్తుంది. నటిగా మాత్రమే కాదు వినయ విధేయతలకు కూడా ప్రశంసలు అందుకుంది. కానీ ఓల్డ్ వీడియోతో మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఆమె మొదటి సీరియల్ ‘కుంకుమ భాగ్య’ చేసే రోజుల్లోని వీడియో ఇప్పుడు తలనొప్పిగా మారింది. ఇందులో సీనియర్ హీరోయిన్ బిపాషా బసును విమర్శించడమే ఇందుకు కారణం.
కోస్టార్ అర్జిత్‌లో మాట్లాడుతున్న మృణాల్.. మగాళ్లలా మాస్కులైన్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా.. అవును తాను బిపాషా బసు ఫిట్ బాడీని లైక్ చేస్తానని.. అలాంటి గర్ల్‌ను చూజ్ చేసుకుంటానని చెప్పాడు. దీనికి స్పందనగా మృణాల్.. అయితే ఆమెనే పెళ్లి చేసుకో.. నేను తన కన్నా చాలా బెటర్ అని చెప్పింది. ఈ వీడియో ధనుష్‌తో డేటింగ్ రూమర్స్ తర్వాత వైరల్ అవుతోంది. తనను కావాలనే ఎవరో టార్గెట్ చేసినట్లుగా నెట్టింట సర్ఫేస్ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. బిపాషాను బాడీ షేమ్ చేసే అర్హత ఎవరకీ లేదని, ఆమె క్వీన్ అని అంటూ.. మృణాల్‌ను తిట్టిపోస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆమె అప్పుడు చిన్న పిల్ల అని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ విషయం బిపాషా వరకు వెళ్లిందో లేదో కానీ ఈ ఇష్యూకు సింక్ అయ్యేలా ఓ పోస్ట్ పెట్టింది. అందంగా కాకుండా బలంగా, కండలు తిరిగిన బాడీని సాధించాలని.. ఓల్డ్ స్టిరియోటైప్స్‌ను బ్రేక్ చేయాలంటూ ఓ క్రిప్టిక్ పోస్ట్‌తో వైరల్ అయిపోయింది.






