- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పెద్ది’ నుంచి మృణాల్ ఔట్.. మిస్ ఇండియా బ్యూటీకి బంపర్ ఆఫర్!
మృణాల్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా.. ఆమె ప్లేస్‌లోకి టాలీవుడ్ యంగ్ అండ్ హాట్ సెన్సేషన్ మానస శర్మ ఎంట్రీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా, కాంబోలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామా గురించి తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదే ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ ఐటెం సాంగ్ గురించి పలు పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ పాటలో 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ మెరుస్తుందని వార్తలు వచ్చాయి. దీంతో రామ్ చరణ్ సరసన స్టెప్పులు వేసేది మృణాల్ అని అంతా భావించారు. కానీ, చివరి నిమిషంలో ఈ భామ తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మృణాల్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా.. ఆమె ప్లేస్‌లోకి టాలీవుడ్ యంగ్ అండ్ హాట్ సెన్సేషన్ మానస శర్మ ఎంట్రీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.ఈ అమ్మడుని మేకర్స్ సంప్రదించగా.. మానస కూడా గ్రీన్ సిగ్న ఇచ్చినట్లు సమాచారం. ఇక ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో యూత్‌కు దగ్గరైన ఈ మిస్ ఇండియా బ్యూటీకి, రెండో చిత్రానికే గ్లోబల్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఈ సాంగ్ కోసం బుచ్చిబాబు అదిరిపోయే స్టెప్పులు ప్లాన్ చేశారని, మానస తన గ్లామర్‌తో ఈ పాటకు సరికొత్త ఊపు తీసుకురాబోతుందని సమాచారం.
నెటిజన్లు సైతం మానసకు ఇది మామూలు ఆఫర్ కాదు.. బంపర్ ఆఫర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు, ఈ సినిమా విడుదల తేదీపై కూడా ఒక అప్‌డేట్ వినిపిస్తోంది. ముందుగా ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకూడదని భావిస్తున్న చిత్ర యూనిట్.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం తీసుకోనుందట. దీనివల్ల సినిమా జూన్ చివరి వారంలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక రామ్ చరణ్ మాస్ మేకోవర్, మానస శర్మ స్పెషల్ సాంగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నట్లు టాక్.






