స్టార్‌ను హీరోను పెళ్లి చేసుకోబోతున్న మృణాల్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

స్టార్‌ను హీరోను పెళ్లి చేసుకోబోతున్న మృణాల్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో, వెబ్ సిరీస్‌లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. పలు హిట్స్ తన ఖాతాలో వేసుకుని క్రేజీ బ్యూటీ మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో అడివి శేష్ ‘డెకాయిట్’(dacoit) సినిమాలో నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో విడుదల కాబోతుంది. ఇక మృణాల్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

వీరిద్దరు కలిసి ఇటీవల పలు ఈవెంట్లకు వెళ్లడంతో పాటు గుసగుసలాడుకోవడంతో డేటింగ్ వార్తలు జోరందుకున్నాయి. ఇక మృణాల్ బర్త్ డే పార్టీకి కూడా పిలవడంతో డేటింగ్ పుకార్లకు బలం చేకూరినట్లు అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, మృణాల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అమ్మడు త్వరలోనే ధనుష్‌(Dhanush)ను పెళ్లాడబోతుందనే న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌‌గా మారింది. ఈ అమ్మడు డేటింగ్ వార్తలు ఎక్కువ అవుతున్న క్రమంలో.. ధనుష్ సోదరీమణులు డాక్టర్ కార్తీక కృష్ణమూర్తి, విమల గీతలను మృణాల్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతున్నట్లు సమాచారం.

ధనుష్ ఇంట్లో మరింత ప్రాముఖ్యతను పెంచుకునేందుకు ఇలా చేస్తుందని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మొదట ఆడబిడ్డలను లైన్‌లో పెట్టి తర్వాత అత్త మామ అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని చూస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ధనుష్‌కు ఇప్పటికే ఒకసారి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే గత కొద్ది కాలం క్రితం మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయినట్లు తెలుస్తోంది. ఇక ధనుష్‌కు దూరంగా ఐశ్వర్య తన తండ్రితో ఉంటుంది.

Next Story