మళ్లీ మారిన మృణాల్-వరుణ్ ధావన్ మూవీ.. కొత్త తేదీ ప్రకటిస్టూ ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |

రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా జూన్ 4వ తేదీ నుంచి తప్పుకోవడంతో, ఆ ఖాళీ అయిన స్లాట్‌ను ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ మేకర్స్ అందిపుచ్చుకున్నారు.

మళ్లీ మారిన మృణాల్-వరుణ్ ధావన్ మూవీ.. కొత్త తేదీ ప్రకటిస్టూ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. లెజెండరీ కామెడీ సినిమాల దర్శకుడు డేవిడ్ ధావన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో, తండ్రీకొడుకుల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొంతకాలంగా ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. మొదట ఈ మూవీని జూన్ 12న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, సినిమాను నెల రోజులు ముందుగానే అంటే.. మే 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామంటూ మరో ప్రకటన చేశారు. తాజాగా ఈ విడుదల తేదీ మరోసారి మారింది. రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ సినిమా జూన్ 4వ తేదీ నుంచి తప్పుకోవడంతో, ఆ ఖాళీ అయిన స్లాట్‌ను ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ మేకర్స్ అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్ 5, 2026న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ నటి మృణాల్ ఠాకూర్ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "జూన్ 5, 2026న థియేటర్లలో విడుదల. మా సినిమా ఇప్పుడు దాని అసలు విడుదల తేదీకే రాబోతోంది. మా క్యాలెండర్‌ను తిరిగి సరిచేసుకోవడంలో సహాయపడినందుకు యష్ గారికి, మాడాక్ ఫిల్మ్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఐపీఎల్ తర్వాత విడుదలయ్యే మొట్టమొదటి పెద్ద సినిమా ఇదే" అంటూ ఆమె రాసుకొచ్చింది. యష్ తన చిత్రాన్ని వాయిదా వేసుకోవడం వల్ల దొరికిన సోలో రిలీజ్ అవకాశాన్ని వాడుకుంటున్నట్లు ఆమె పరోక్షంగా తెలిపారు. డేవిడ్ ధావన్ సినిమాలంటేనే వినోదం, కామెడీ ట్రాక్స్‌కు పెట్టింది పేరు. ఇందులో వరుణ్ ధావన్ సరసన ఇద్దరు స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ నటిస్తుండటంతో ఇది ఒక కలర్ ఫుల్ రోమాంటిక్ కామెడీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు వస్తున్న మొదటి చిత్రం కావడంతో, కలెక్షన్ల పరంగా ఈ సినిమాకు మంచి అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది.

Next Story