- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ స్టార్ ‘కూలీ’ థర్డ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మూవీ మేకర్స్.. పవర్ హౌస్ రాబోతుందంటూ హైప్ పెంచుతున్న పోస్ట్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(coolie).

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’(coolie). ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఉపేంద్ర , శృతి హాసన్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో కనిపించబోతుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ సాంగ్ సూపర్ రెస్సాన్స్‌ను దక్కించుకుంది. అత్యధిక వ్యూస్‌ను రాబడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. షూటింగ్ టకా టకా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ రాబోతున్నట్లు చిత్రబృందం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. ‘కూలీ’ నుంచి పవర్ హౌస్ అని సాగే మూడో పాటను ఈనెల 22వ తేదీన రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్‌లోని క్వేక్ అరేనాలో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పోస్ట్‌కు ‘‘ధైర్యంగా ఉండండి.. కూలీ మూడవ సింగిల్ పవర్‌హౌస్ పాట మీ ముందుకు రాబోతుంది’’ అని క్యాప్షన్ జత చేసి ఫైర్ ఎమోజీలు పెట్టి హైప్ పెంచారు. ఈ పాటకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. అనిరుద్ కలిసి పాడినట్లు సమాచారం. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు పెడుతూ ప్రభాస్‌ను చీఫ్ గెస్ట్‌గా పిలవాలని సలహాలు ఇస్తున్నారు.






