- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మెగా-157’ నుంచి డబుల్ అప్డేట్స్ రాబోతున్నాయంటూ మూవీ మేకర్స్ ట్వీట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ‘మెగా-157’ వర్కింగ్ టైటిలంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార(Nayanthara) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ యాక్షన్ అండ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఆర్యన్ ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఇక అనౌన్స్‌మెంట్ నుంచే బజ్ క్రియేట్ అయిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘మెగా-157’ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన మూడవ షెడ్యూల్ కేరళలో పూర్తి చేసుకుని మెగాస్టార్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ఒక అందమైన పాట, కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత ‘Mega157’ బృందం అందమైన కేరళ షెడ్యూల్‌ను ముగించింది. త్వరలోనే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రాబోతున్నాయ్’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.






