- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Prabhas: ‘ది రాజాసాబ్’ నుంచి బిగ్ అప్డేట్ రాబోతుందంటూ మూవీ మేకర్స్ ట్వీట్.. ఫుల్ ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’(The Rajasaab).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’(The Rajasaab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad), వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, యోగి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. రొమాంటిక్, హారర్ సినిమాగా తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ మూవీ ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో డార్లింగ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఈ నేపథ్యంలోనే.. చిత్రబృందం ‘ది రాజాసాబ్’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘ది రాజాసాబ్’సినిమా నుంచి అప్డేట్ రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ టీజర్ జూన్ 16న ఉదయం 10: 52 గంటలకు రాబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పనులు జరుగుతున్నట్లు తమన్ ఫొటో ద్వారా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






